ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కారుమూరి వెంకట నాగేశ్వరరావు

ETV Bharat / videos

Minister Karumuri Nageswara Rao: ఓయ్‌ నోరు మూసుకో.. రైతుపై మంత్రి రుసరుసలు - వైసీపీ మంత్రులు వైరల్ వీడియోలు

By

Published : May 9, 2023, 1:47 PM IST

Minister Karumuri Nageswara Rao Fires on Farmer: మంత్రి కారుమూరు మరోసారి రైతులపై నోరు పారేసుకున్నారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో పర్యటించిన పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు  ఓ రైతును దుర్భాషలాడారు.. తాజాగా తన తీరుతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని పరిశీలించేందుకు ఏలూరు జిల్లా నాచుగుంట, ఉంగుటూరులో మంత్రి కారుమూరి పర్యటించారు. రైతులు తమ సమస్యలను మంత్రి వద్దకు చెప్పుకున్నారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మంత్రి.. ఓ రైతును ఓయ్ నోరు మూసుకోనిపోవయ్యా అంటూ మండిపడ్డారు. మరో సందర్భంలో రైతులు ఆయనకు సమస్యలు చెబుతుండగా వీడియో తీస్తున్న విలేకరులను సైతం.. ఇక చాలు వీడియో తీయడం ఆపాలంటూ చేతితో సైగ చేశారు. ఇటీవలే నాచుగుంటలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం కూడా.. ధాన్యం తడిసి మొలకెత్తిందని సమస్య విన్నవించిన రైతుపై నేనేం చేస్తానంటూ మంత్రి  దుర్భాషలాడారు.

ABOUT THE AUTHOR

...view details