తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది - సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడి : మంత్రి కాకాణి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 5:06 PM IST
Minister Kakani Govardhan Reddy In vijayawada : రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దనరెడ్డి తెలిపారు. మిగ్‌జాం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని సీజన్ ముగిసేలోగా అందజేస్తామని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్ లో భారతీయ నాణ్యత మండలి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన గుణవత్తా సంకల్ప్ సదుస్సులో మంత్రి కాకాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పంటల ఉత్పాదకతతోపాటు నాణ్యత పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని సీజన్ ముగిసేలోగా అందజేస్తామని చెప్పారు. ప్రకృతి విపత్తులను ఆపడం ఎవరితరం కాదని, అదే సమయంలో ైతులకు అండగా నిలవడంలో తమ ప్రభుత్వం ముందు వరుసలో నిలిచిందని మంత్రి కాకాని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్నిరకాల సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.