ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంత్రి గుడివాడ అమర్నాథ్

ETV Bharat / videos

Minister Amarnath's comments: అమ్మాయిలు పవన్​ను చూసి భయపడుతున్నారు: మంత్రి అమర్నాథ్ - వాలంటీర్లు

By

Published : Jul 10, 2023, 1:35 PM IST

Minister Amarnath's comments on Pawan: రాష్ట్రంలో అమ్మాయిలు ఎవరికైనా భయపడుతున్నారూ అంటే... అది జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చూసేనని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఏలూరు వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. కోవిడ్‌ సమయంలో వాలంటీర్లు చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు అని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి స్వయంగా దేశ ప్రధాని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి.. దేశానికే ఆదర్శంగా నిలిచిన వాలంటీర్ల గురించి పవన్ మాట్లాడడం అవివేకం అని మంత్రి పేర్కొన్నారు. ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు.. ఎక్కడెక్కడ వితంతువులున్నారనే వివరాలు తెలుసుకుంటున్నారని అంటున్న పవన్.. తన ఆలోచనలను బలవంతంగా రుద్దితే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. 'ఈ రోజు అమ్మాయిలు ఎవరికైనా భయపడుతున్నారంటే అది పవన్ కల్యాణ్​కే అని... ఎక్కడ తాళి కట్టేస్తావేమో అని' అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details