ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కంట తడి పెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్ - టికెట్​ ఇవ్వనందుకేనా? - Anakapalli AssemblyTicket

🎬 Watch Now: Feature Video

gudivada_amarnath

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 12:16 PM IST

Minister Gudivada Amarnath Burst Into Tears:అనకాపల్లి వైఎస్సార్​సీపీ అసెంబ్లీ టికెట్‌ మరొకరికి ఇవ్వడంతో మంత్రి గుడివాడ అమర్నాథ్ కంట తడి పెట్టుకున్నారు. నియోజకవర్గ కొత్త ఇంఛార్జ్‌ భరత్‌ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. భరత్​ను కార్యకర్తలకు పరిచయం చేసిన మంత్రి అమర్నాథ్ అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు. మిమ్మల్ని వీడి బాధతో వెళుతున్నాను మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అంటూ  మాట్లాడారు.

తల్లిదండ్రులు జన్మనిస్తే అనకాపల్లి ప్రజలు రాజకీయంగా పునర్జన్మనిచ్చారని, ఇక్కడి ప్రజలు రుణం తీర్చుకోలేనిదని అమర్నాథ్ వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏది నిర్ణయిస్తే దానికి తాను కట్టుబడి ఉంటానని, కార్యకర్తగా పార్టీ జెండా పట్టుకొని ప్రచారం చేయడానికి తను సిద్ధమని వెల్లడించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్సార్​సీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి విశాఖ రూరల్ ఇంఛార్జ్​గా వ్యవహరిస్తూ అనకాపల్లిలో రాజకీయ నేతగా ఎదిగారు. 2014 అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా, 2019 శాసన సభ్యుడిగా గెలిచి కేబినెట్​లో మంత్రి అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details