Minister Dharmana జగనన్న ఇస్తున్న పథకాలు అన్నీ ఆగిపోతాయి.. మీకు విజ్ఞత ఉండాలి! : మంత్రి ధర్మాన - శ్రీకాకుళం నగరపాలకసంస్థ పరిధిలోని ఫాజుల్ బాగ్ పేట
Minister Dharmana Prasada Rao's comments: చంద్రబాబు మాటలు నమ్మితే.. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు.. మహిళామణులకు హితబోధ చేశారు. ఇన్ని పథకాలు ఇస్తున్నపుడు మీకు విజ్ఞత ఉండాలని.. మళ్లీ వైసీపీకి ఓటు వేయాలని చెప్పారు. శ్రీకాకుళం నగరపాలకసంస్థ పరిధిలోని ఫాజుల్ బాగ్ పేట వార్డు సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఎన్నికల నాడు మేనిఫెస్టోలో చెప్పినవి చేస్తున్నామన్న మంత్రి ధర్మాన.. ఈసారి మాకు ఓటు వేస్తారా.. అంటూ... విన్నవించుకున్నారు. ప్రజలు వాలంటీర్లు సేవలు కావాలని కోరుకుంటే.. కొంతమంది వారిని తొలగించాలని కోరుకుంటున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఇంకో పార్టీకి ఓటు వేసే పొరపాటు చేయొద్దన్నారు. రాష్ట్రాన్ని బాగుచేయాలంటే స్త్రీలను బలోపేతం చేయాలనుకున్నాం. అందుకే ప్రభుత్వ పథకాలను మహిళల పేరు మీదనే ఇస్తున్నాం. మహిళా శక్తి కేంద్రంగానే ఇళ్ల స్థలాలతో పాటు అన్ని రకాల గౌరవాన్ని కల్పిస్తున్నాం. ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టోను అమలు చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే తప్ప కొత్తగా ఏమీ చేయడం లేదు. ఏం చెప్పామో అదే చేశాం అని మంత్రి పేర్కొన్నారు.