ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister_Chelloboina_Venugopal

ETV Bharat / videos

Minister Chelluboina Venugopal on BC Caste Enumeration: నవంబర్ 15 నుంచి బీసీల కులగణన ప్రారంభం: మంత్రి వేణుగోపాల్ - Minister Chelluboina Venugopal news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 10:35 PM IST

Minister Chelluboina Venugopal on BC Caste Enumeration: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నవంబర్ 15వ తేదీ నుంచి బీసీల కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చేందుకు సంక్షేమ శాఖల ఉన్నత అధికారులతో ఓ కమిటీని నియమించినట్లు వెల్లడించారు. ఈ కులగణన కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు.

Chelluboina Venugopal Comments: ''139 రకాలుగా ఉన్న వెనుకబడిన వర్గాలకు అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. జనగణన ప్రక్రియలో కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. అది ప్రస్తుతం జరిగే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఈ కారణంగా ఏపీలో రాష్ట్ర ప్రభుత్వమే బీసీల  కులగణన చేయాలని నిర్ణయించింది. దీనిపై సంక్షేమ శాఖల ఉన్నత అధికారులతో ఓ కమిటీని కూడా నియమించాం. సంఖ్యా పరంగా ఎంత మంది ఉన్నారని ఆయా బీసీ వర్గాల వారు తెలుసుకోవడం అవశ్యకం. దీనికి కులగణన ఒక్కటే మార్గం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల సంఘాల నేతలతో విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజ మహేంద్రవరం, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తాం. ఈ కులగణన ఎన్నికల కోసం కాదు. మిగిలిపోయిన బీసీ వర్గాలకు ప్రత్యేక పథకాలు అందించేందుకు.'' అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details