ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister Buggana Rajendranath Meet Australian in Vijayawada

ETV Bharat / videos

ఆస్ట్రేలియా కాన్సుల్​ జనరల్​ శారా కిర్​తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన భేటీ - ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ శారా కిర్ల్ ఏపీ తాజా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 12:08 PM IST

Minister Buggana Rajendranath Meet Australian in Vijayawada :  ఆంధ్రప్రదేశ్​ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ శారా కిర్ల్ భేటీ అయ్యారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్​లో ఆంధ్రప్రదేశ్​ ఆస్ట్రేలియా మధ్య పరస్పర సహకారం పై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో అభివృద్ధి కోసం నైపుణ్యం, విద్య, పర్యాటక, సేవా రంగాలలో పెట్టుబడుల పై ఆస్ట్రేలియా ప్రతినిధులు ఏపీ మంత్రి బుగ్గన తో చర్చించారు. 

Andhra Pradesh Finance Minister Meeting With Australian Council : ఆస్ట్రేలియా కాన్సుల్​ జనరల్​ శారా కిర్​తో జరిగిన సమావేశంలోని అంశాన్ని ఆర్థిక మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ చర్చల్లో ఏపీ తరఫున మంత్రి బుగ్గనతో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్. రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఎన్. గుల్జార్, కేవీవీ. సత్యనారాయణ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సహా తదితరులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details