ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister Botsa Satyanarayana On TDP Janasena

ETV Bharat / videos

Minister Botsa Satyanarayana On TDP Janasena:టీడీపీ, జనసేన కలసినా తమకేమీ నష్టం ఉండదు.. వారాహి యాత్రలో కలిసే తిరుగుతారు: మంత్రి బొత్స - Minister Botsa Satyanarayana

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 7:58 PM IST

Minister Botsa Satyanarayana On TDP Janasena: టీడీపీ, జనసేన కలసినా తమకేమీ నష్టం లేదని.. మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు.  టీడీపీ, జనసేన   (TDP Janasena Alliance) ఎప్పటి నుంచో కలిసి ఉన్నాయన్న ఆయన.. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వారాహి యాత్రలో ఇప్పుడు వారిద్దరు కలిసి తిరుగుతారని వ్యాఖ్యానించారు.  ఆ రెండు పార్టీలు కలిసినా మాకేమీ నష్టం ఉండదని బొత్స అన్నారు. ఆ ఇద్దరితో పాటు.. మరికొంత మంది కలిసినా మా పార్టీకేమీ నష్టం లేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్ (Guaranteed Pension Scheme) విధానంపై ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. ఓపీఎస్ అనేది కష్టసాధ్యమైన వ్యవహారం అని.. అందుకే జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే ఆయా అంశలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి బొత్స తెలిపారు. 

అక్టోబర్ 27వ తేదీ నుంచి జరగనున్న విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహణపై.. వివిధ శాఖలు, ప్రజా, సాంస్కృతిక సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షించారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా.. అందరి సహాయ సహకారాలతో.. విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details