ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులు: మంత్రి బొత్స

ETV Bharat / videos

Minister Botsa Satyanarayana meeting with teachers unions : పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులు: మంత్రి బొత్స - విజయవాడ వార్తలు

By

Published : Aug 9, 2023, 2:02 PM IST

Minister Botsa Satyanarayana meeting with teachers unions : పదో తరగతి విద్యార్థులకు పరీక్షల విధానంలో మార్పులు తీసుకువస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు పదోన్నతుల తర్వాత వారి జీతాల చెల్లింపులో కొంత ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా వారికి జీతాలు చెల్లిస్తామన్నారు. అలాగే ఎంఈవో - 1, 2 పోస్టుల జాబ్‌ ఛార్టులపై చర్చ చేపట్టాల్సి ఉందని, దీనిపై ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. వచ్చే వారం మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి.. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.  

Minister Botsa responded on Chiranjeevi comments: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రహీరో, మాజీ రాజ్యసభ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ''సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని చిరంజీవి ఒప్పుకున్నారా..? ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. చిరంజీవి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలి..? ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుంది. చిరంజీవి వ్యాఖ్యలు చూశాక పూర్తి స్థాయిలో నేను స్పందిస్తా. సినీ పరిశ్రమ ఓ పిచ్చుక అని చిరంజీవి అంగీకరిస్తారా..?'' అంటూ బొత్స వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details