ఆంధ్రప్రదేశ్

andhra pradesh

minister_botsa_comments

ETV Bharat / videos

కెరీర్ టూల్‌కిట్ ఆన్‌లైన్ టీచింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన మంత్రి బొత్స - మంత్రి బొత్స వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 4:50 PM IST

Minister Botsa Satyanarayana Launched Career Toolkit Programme: ఉన్నత (ఆర్ట్స్, సైన్స్, మెడికల్) విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన 'కెరీర్‌ టూల్‌కిట్‌ ఆన్‌లైన్‌ టీచింగ్‌ ప్రోగ్రామ్‌'ను విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

Botsa Comments: ''రాష్ట్రంలో ఎవరైతే ఉన్నత (ఆర్ట్స్, సైన్స్, మెడికల్) విద్యను పూర్తి చేసుకున్నారో వారికి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'కెరీర్‌ టూల్‌కిట్‌ ఆన్‌లైన్‌ టీచింగ్‌ ప్రోగ్రామ్‌'ను రూపొందించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ పోగ్రామ్ ద్వారా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. విద్యార్థి మీద ఎక్కడ కూడా ఆర్థిక భారం పడకుండా అంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ కెరీర్‌ టూల్‌కిట్‌‌ను రూపొందించిన ప్రతి ఉద్యోగిని ప్రభుత్వం తరుఫున అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా విశ్వవిద్యాలయాలు అందించే 2వేల కోర్సులను ఆన్‌లైన్‌లో చదువుకునే వెసులుబాటును కల్పిస్తున్నాం. సెమిస్టర్ల వారీగా విద్యార్ధులకు కార్యాచరణ ప్రణాళిక అందించడమే లక్ష్యంగా 19 రకాల కెరీర్ టూల్‌కిట్లను తెచ్చాం'' అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details