New Zonal System: జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉంది: మంత్రి బొత్స - sub committee on new zonal systems
Minister Botsa Satyanarayana Comments on New Zonal System in AP: జిల్లాల పునఃవ్యవస్థీకరణ అనంతరం జోనల్ వ్యవస్థ ఏర్పాటు సహా ఉద్యోగ సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘం బేటీ అయ్యింది. ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో మంత్రుల కమిటీ చర్చించింది. త్వరలోనే ఏపీలో కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు పై కసరత్తు ముమ్మరం చేశామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని తెలిపారు. జోనల్ వ్యవస్థపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. త్వరలో కారుణ్య నియామకాలు కూడా చేపడతామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్జీకరణపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కటాఫ్ డేట్ మార్చే అంశంపై ఆలోచన చేస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే నెల ఆగస్టు ఏడో తేదీన కాంట్రాక్టు ఉద్యోగుల క్రబద్దీకరణపై జీవో జారీ అవుతుందని వెల్లడించారు.