ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పవన్ కల్యాణ్​పై అంబటి రాంబాబు ఫైర్

ETV Bharat / videos

Ambati Rambabu Fires On Pawan 'పవన్ చేసిన విప్లవాలు, పోరాటాలు ఏంటి..?': మంత్రి అంబటి - పవన్ కల్యాణ్​పై అంబటి రాంబాబు కామెంట్స్

By

Published : Jul 1, 2023, 5:45 PM IST

Ambati Rambabu Fires On Pawan Kalyan: భీమవరం సభలో పవన్ కల్యాణ్ ఓ రౌడీలా, అసాంఘిక శక్తిలా మాట్లాడారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని తిట్టడమేనా పవన్ పాలసీ అంటూ మంత్రి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అంబటి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ మాటలు విని నవ్వాలో, ఏడవాలో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. మాట్లాడితే పవన్ కల్యాణ్ విప్లవం అంటున్నారని.. ఇంతకీ ఏ విప్లవంలో పాల్గొన్నారో పవన్ చెప్పాలన్నారు. మూడు పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్ నీతులు చెబితే హాస్యాస్పదంగా ఉందని.. మూడు పెళ్లిళ్లు చేసుకోవడమేనా పవన్ కల్యాణ్ చెప్పే ఆదర్శమంటూ ఎద్దేవా చేశారు. జగన్ పోవాలంటున్న పవన్.. ఎవరు రావాలో చెప్పాలని.. జగన్ మోహన్ రెడ్డి పోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని.. సినిమా పిచ్చి, కులపిచ్చితో.. పవన్​ను యువత అనుసరించవద్దని మంత్రి అంబటి కోరారు.

ABOUT THE AUTHOR

...view details