ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister Ambati Rambabu Review Meeting

ETV Bharat / videos

Minister Ambati Rambabu Advice to Farmers: వర్షాలు లేవు.. వరి సాగు వద్దు: మంత్రి అంబటి రాంబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2023, 6:08 PM IST

Minister Ambati Rambabu Advice to Farmers on Paddy: గతంలో ఎన్నడూ లేనంతగా.. ఈసారి తక్కువ వర్షపాతం నమోదైందని.. అందువల్ల నాగార్జున సాగర్‌లో నీరు తక్కువగా ఉందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వర్షాభావ కారణంగా సాగునీటి కొరత ఏర్పడిందన్నారు. గుంటూరు కలెక్టరేట్​లో సాగునీటి సలహా మండలి (Irrigation Advisory Board), వ్యవసాయ సలహా మండలి (Agricultural Advisory Board) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వర్షాలు తక్కువగా పడటం వలన సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు వరి సాగు చేయవద్దని.. కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని మంత్రి అంబటి సూచించారు. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే.. పంటలకు నీటిని అందించేందుకు వారాబందీ అమలు చేస్తామని వెల్లడించారు.

Ambati Rambabu React on Chandrababu Comments: తనను అరెస్ట్​ చేయొచ్చోమోనన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. అంతా సమానమేనని.. మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఐటీ నోటీసులపై సమాధానం చెప్పేందుకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేసి ఉంటే చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారని.. ఆయన తప్పు లేకుంటే అరెస్ట్‌ చేయరని అన్నారు. సానుభూతి కోసమే తనను అరెస్ట్‌ చేస్తారని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details