ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధాని పరిధిలో టిడ్కో గృహ సముదాయాల్ని పరిశీలించిన మంత్రి సురేశ్‌

ETV Bharat / videos

టిడ్కో ఇళ్లపై ఎవరి హయాంలో ఏం చేశామో చర్చకు సిద్ధమా?: ఆదిమూలపు సురేష్ - ఏపీలో పట్టాల పంపిణీ

By

Published : May 25, 2023, 10:59 PM IST

Minister Adimulapu Suresh on Tidco houses:  టిడ్కో గృహ సముదాయాల్లో అన్ని మౌళిక వసతులు కల్పించి లబ్దిదారులకు పంపిణి చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టిడ్కో ఇళ్లపై ఎవరి హయాంలో ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమని విపక్షాలకు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్‌ విసిరారు. టిడ్కో గృహ సముదాయాల్లో అన్ని మౌళిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెంలో టిడ్కో ఇళ్లను ఆయన ఇవాళ పరిశీలించారు. 

అమరావతి పరిధిలోని 8 ప్రాంతాల్లో 5వేల గృహాల్ని నిర్మించినట్లు మంత్రి అదిమూలపు వెల్లడించారు.  అందులో సింగిల్ బెడ్ రూం ఇళ్లను కేవలం రూపాయికే లబ్దిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.  ఈనెల 26న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణితో పాటుగా... రాజధానిలోని టిడ్కో లబ్ధిదారులకు గృహాల్ని అందజేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ  హయంలో టిడ్కో గృహాల నిర్మాణం జరిగినప్పటికీ, వాటికి మౌళిక సదుపాయాలేవీ కల్పించలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే వాటి రూపురేఖలు మార్చి పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు వివరించారు. టిడ్కో ఇళ్లపై ఎవరి హయాంలో ఏం చేశామో చర్చకు సిద్ధమన్నారు. 

ABOUT THE AUTHOR

...view details