ఆంధ్రప్రదేశ్

andhra pradesh

mining_mafia_infiltrated_to_rustum_quarry

ETV Bharat / videos

నెల్లూరు జిల్లాలోని రుస్తుం మైనింగ్​లో అర్థరాత్రి హల్​చల్​ - అధికార పార్టీ నేత అనుచరుల నిర్వాకం - నెల్లూరు జిల్లా రుస్తుం మైనింగ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 7:53 PM IST

Mining Mafia Infiltrated to Rustum Quarry: నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు పెట్రేగిపోతున్నాయి. మంత్రి కాకాణి నియోజకవర్గం పోదలకూరు మండలం తాడిపర్తి వద్ద మైన్​లోకి చొరబడిన అక్రమార్కులు స్థానికులను భయాందోళనకు గురిచేశారు. రుస్తుం మైనింగ్​లో తనను బెదిరించి క్వారీలో మైనింగ్ చేసేందుకు  వైసీపీ నాయకుడు పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అనుచరులు యత్నిస్తున్నారని.. మైనింగ్ ఓనర్ విద్యా కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ విద్యాకిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పేర్నేటీ శ్యామ్​ ప్రసాద్​ మనుషులు ఘటనకు ముందే క్వారీలో మైనింగ్​ చేసుకుంటామని బెదిరించినట్లు మైనింగ్​ ఓనర్​ తెలిపారు. 

వారు బెదిరించినట్లుగానే రాత్రి సమయంలో వచ్చి నానా గొడవ చేశారని.. భారీ యంత్రాలను తీసుకువచ్చి తవ్వకాలను పూనుకున్నారని వివరించారు. చట్టపరమైన అర్హతలు తనకు ఉన్నాయని.. తన లీజ్​ ఇంకా పూర్తి కాలేదని ఆయన అన్నారు. వారు చేసే పనికి తన లీజ్​కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై తాను పోలీసులను ఆశ్రయించినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details