ఆంధ్రప్రదేశ్

andhra pradesh

michaung_effect_manyam_district

ETV Bharat / videos

ఉప్పొంగుతున్న వాగు - కాజ్​ వే గండిని పరిశీలించిన ఉన్నతాధికారులు - పాచిపెంట మండలం గురువు నాయుడుపేట

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 6:38 PM IST

Michaung Cyclone in Parvathipuram Manyam District : మిగ్​జాం తుపాను కారణంగా రాష్ట్రంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గురువు నాయుడుపేటకు రాకపోకలు సాగించే కాజ్ వేకు గండి కొట్టారు. దీంతో గ్రామంలోకి రాకపోకలు స్తంభించడం వల్ల ప్రజలకు ఇబ్బందిగా మారింది. స్థానికంగా ఏర్పడిన పరిస్థితిని ఆర్​ అండ్​ బి అధికారులు పరిశీలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.

Cyclone Effect Farmers : మిగ్​జాం తుపాను పార్వతి జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకొని అప్పులు తీర్చుకోవచ్చని రైతులు అనుకుంటే వారి ఆశపై తుపాను నీళ్లు చల్లింది. నూర్పు చేసిన ధ్యాన్యాన్ని అమ్ముకోలేక, కోత కోసిన వరి పంటను రక్షించుకోలేక తీవ్రంగా నష్టపోయారు. ఈ కష్ట సమయంలో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో నష్టపోయిన పంటను అంచనా వేసి తొందరగా పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details