ఆంధ్రప్రదేశ్

andhra pradesh

michaung_cyclone_effect_in_kakinada_district

ETV Bharat / videos

తుపానుతో తడిసి ముద్దైన పంట- కోలుకునేలోపే పంపా రిజర్వాయర్ వల్ల పూర్తిగా నాశనం - తుని రిజర్వాయర్​ వల్ల రైతుల కష్టాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 12:13 PM IST

Michaung Cyclone Effect In Kakinada District :మిగ్​జాం తుపానుతో కురిసిన అకాల వర్షాలతో కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో కోతకొచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంపా రిజర్వాయర్ నిండిపోవడంతో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. పంపా కాల్వ ఉద్ధృతంగా ప్రవహిస్తూ తీరంలోని  పొలాలను ముంచెత్తింది. ముంపులో ఉన్న పంటల పరిస్థితిపై తుని మండలం నుంచి  ఈటీవీ ప్రతినిధి సాయికృష్ణ అందిస్తున్న కథనం.  

Farmers Probelms In Due To Pampa Reservoir :తుపాను కారణంగా పంట పొలాల్లో చేరిన నీటిని చూపిస్తూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను సంభవించి వారం రోజులు గడిచినప్పటికీ పొలాలు చెరువులను  తలపిస్తున్నాయని అన్నదాతలు విలపిస్తున్నారు. నీటిలో తడిసి ముద్దైన పంట మొలకలొస్తున్నాని రైతులు పేర్కొన్నారు. తుపాను తరువాత పంటలు ఎండిపోయాయని, పంపా రిజర్వాయర్​ గేట్లు తెరిచిన కారణంగా పొలాలు మళ్లీ నీళ్లతో నిండడంతో పంటలు మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తుని మండలం సహా తొండంగి తదితర సమీప గ్రామాల్లో పంటలు నీట మునిగాయని బాధిత రైతులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details