ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Michaung_Cyclone_Affected_in_Guntur

ETV Bharat / videos

తుపాను బీభత్సంతో నీటమునిగిన పంటలు - సర్కారు సాయం అందక అన్నదాతల కుదేలు - varigani farmers lossed of cyclone

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 6:20 PM IST

Michaung Cyclone Affected in Guntur: గుంటూరు జిల్లాలో మిగ్‌జాం తుపాను బీభత్సం సృష్టించి ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరగానిలో మిర్చి, పొగాకు, వరి పంటలు పూర్తిగా నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. చేతికందిన పంటలు నీటమునిగి నష్టాన్ని మిగిల్చాయని రైతులు వాపోతున్నారు. కాల్వల పూడికలు,మరమ్మతు చర్యల లోపంతో వరద నీరు పొలాల్లోకి చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  

Cyclone Left Loss to Farmers: పంట సాగుకు నీరు లేకపోతే పైపులు, ఇంజన్ల ద్వారా నీరందించి సాగు చేశామని చేతికి అందే సమయంలో పంట నేలపాలైందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తుపాను లేకపోతే ఈ సమయానికి పంట చేతికి అందేదని, అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని రైతులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో రైతులకు ధాన్యాన్ని కాపాడుకోవడానికి పరదాలు అందించే వారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధంగా రైతులకు సహాయసహకారాలు అందించడం లేదని రైతులు పేర్కొన్నారు. నీటి సరఫరా, పరదాలు వంటివి వైసీపీ ప్రభుత్వం నుంచి అందటం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి నష్టపరిహారాన్ని అందించి రైతులు ఆదుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details