Mekapati Rajagopal Reddy Impatience on MRO: "నీ అంత అన్ఫిట్ అధికారిని ఎక్కడా చూడలేదు".. ఎమ్మార్వోపై వైసీపీ నేత విసుర్లు - Rajagopal Reddy in gadapa gadapa program
Mekapati Rajagopal Reddy Impatience on MRO: రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడంలో బిజీ అయ్యారు. పార్టీ పెద్దల నుంచి వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే గడప గడపకు వెళ్లిన ప్రజాప్రతినిధులకు భంగపాటు తప్పడం లేదు. కాగా, ఓ తహశీల్దార్ పై.. ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
Gadapa Gadapa Program in Nellore: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మర్రిగుంటలో.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై రాజగోపాల్ రెడ్డికి చాలా ఫిర్యాదులు అందాయి. ఆ సమయంలో తహశీల్దార్ హుస్సేన్ అక్కడ లేకపోవడంతో.. రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీ అంత అన్ ఫిట్' అధికారిని ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తారు. మొదట్నుంచీ గమనిస్తున్నానని.. పనితీరు అస్సలు బాలేదంటూ మండిపడ్డారు. అభ్యంతరం ఉంటే చెప్పండి.. కలెక్టర్కు చెప్పి.. మరొకరిని వేయించుకుంటానని.. రాజగోపాల్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.