దరఖాస్తు చేసినా జాబితాలో లేని ఓటర్లు - విధుల్లో నిర్లక్ష్యంపై ఆరుగురు బీఎల్వోల సస్పెన్షన్ - Deletion of votes in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 6:52 PM IST
Massive Irregularities in Voter List in Prakasam District:ప్రకాశం జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను చూసి ఓటర్లు అవాక్కవుతున్నారు. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు జాబితాలో చేర్చనూలేదు. చనిపోయిన వారి పేర్లు తొలగించనూ లేదు. మొత్తానికి ముసాయిదా ఓటర్ల జాబితా అంతా తప్పులతడకలతో ఉన్నాయి. బీఎల్వోలు పోలింగ్ కేంద్రాల వద్ద పరిశీలన కోసం ఉంచిన వీటిని పలువురు పరిశీలించి అవాక్కవుతున్నారు. ఒంగోలులో ఓటరు నమోదు కోసం అందజేసిన అర్జీల్లో ముూడు వంతులు జాబితాలో లేవని పలువురు ఆరోపిస్తున్నారు.
డివిజన్లలో బూత్ పరిధిలో 84 వేల 333 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేదుగా.. కేవలం కొంతమంది పేర్లు మాత్రమే జాబితాలో కనిపించడం ఇందుకు నిదర్శనం.. చాలా చోట్ల చనిపోయినవారి ఓట్లను లిస్టులో నుంచి తొలగించలేదని అంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్వోలు అందుబాటులో ఉండటం లేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు బీఎల్వోలను కలెక్టర్ సస్పెండ్ చేశారు.