ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం

ETV Bharat / videos

హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం - షాపింగ్ మాల్​లో చెలరేగిన మంటలు - fire Accident in CMR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 10:59 PM IST

Massive fire Accident in CMR Shopping mall at Uppal: హైదరాబాద్​లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడి మల్కాపూర్​లోని అంకుర హాస్పిటల్​లో ఫైర్ యాక్సిడెంట్ మరిచిపోకముందే ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు మాల్ అంతటికీ శరవేగంగా వ్యాపిస్తున్నాయి. మాల్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన డెకరేషన్​లో మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. 

మంటలు అంటుకున్న సమయంలో షాపింగ్ మాల్​లో ఎంత మంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియలేదు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ స్టేషన్​కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడిన విషయం ఇంకా తెలియడం లేదు. ఉప్పల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు తెలిసే అవకాశముంది. 

ABOUT THE AUTHOR

...view details