ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Martin_Luther_King_Movie_Team_at_Vijayawada

ETV Bharat / videos

Martin Luther King Movie Team at Vijayawada: విజయవాడలో 'మార్టిన్ లూథర్ కింగ్' సందడి.. ప్రేక్షకులను పలకరించిన చిత్ర బృందం - ఎన్టీఆర్​ జిల్లా తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 12:15 PM IST

Martin Luther King Movie Team at Vijayawada: మార్టిన్ లూథర్ కింగ్ మూవీ టీం విజయవాడలో సందడి చేసింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఆ సినిమా కథానాయకుడు సంపూర్ణేష్ బాబుతో పాటు దర్శకులు పూజ, వెంకటేష్​ మహా విజయవాడలోని ఎల్​ఈపీఎల్​ ఐనోక్స్ థియేటర్​కి  వచ్చారు. అభిమానులతో కలిసి ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన అనంతరం.. మూవీపై వాళ్ల అభిప్రాయాలను చిత్ర బృందం స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

మార్టిన్​ లూథర్​ కింగ్​ సినిమా.. రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీ తగట్టుగా తెరకెక్కించినట్టు చిత్ర బృందం తెలిపింది.  ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యత గురించి యువతకు, ప్రజలకు చాటి చెప్పే విధంగా చక్కటి సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని మూవీ టీం పేర్కొంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్​ ఆశాభావం వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details