ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Married_Woman_Committed_Suicide_in_Narasarao_Peta

ETV Bharat / videos

మరో వ్యక్తికి 'బై' చెప్పిందని భర్త ఆగ్రహం - పెళ్లయిన రెండు నెలలకే యువతి ఆత్మహత్య - AP Crime News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 3:15 PM IST

Married Woman Committed Suicide in Narasarao Peta:పల్నాడు జిల్లా నరసరావుపేటలో శిల్ప(19) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన శిల్ప, చల్లా వెంకటేశ్​తో రెండు నెలల క్రితం వివాహమైంది. శిల్ప మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె బంధువులకు వెంకటేశ్ ఫోన్ చేసి చెప్పాడని మృతురాలి బావ తెలిపాడు.

వచ్చే పండుగ రోజున శిల్పను తీసుకువచ్చి తన గ్రామంలో విడిచిపెట్టి వెళ్తానని చెప్పారన్నారు. ఈ లోగా శిల్ప ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిందని మృతురాలి బావ మీడియాకు వివరించారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం మృతురాలి భర్త వెంకటేశ్​ను అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details