Marigold Farmers Gets Loss: అమాంతం పడిపోయిన బంతి ధరలు.. గిట్టుబాటలేక రోడ్లపై పారబోత.. - ఏపీలో ముద్దబంతి పూల సాగు న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 8:04 PM IST
Marigold Farmers Gets Loss: ఆరుగాలం కష్టపడి బంతి సాగు చేసిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. బంతిపూల ధరలు అమాంతం పడిపోవటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు రోడ్డు పక్కనే వాటిని పారబోశారు. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం సీతరామాపురానికి చెందిన రైతులు.. వేల ఎకరాల్లో బంతిపూలు సాగు చేశారు. పంట దిగుబడులు బాగా రావడంతో.. రెండు బొలేరో వాహనాల్లో 27 క్వింటాళ్ల పూలు విజయవాడకు తీసుకెళ్లారు. కిలో 5 రూపాయలకు ఇస్తామన్నా ఎవరూ తీసుకోకపోవడంతో.. తిరుగు ప్రయాణంలో చిలకలూరిపేట వద్ద రోడ్డు పక్కన పడేశారు. అప్పులు తెచ్చి బంతిపూల సాగుపై పెట్టుబడులు పెట్టగా.. ఇప్పుడు రవాణా ఖర్చులు వచ్చే పరిస్థితి కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లేకపోవటం వల్ల వందల ఎకరాల్లో ఉన్న రెండోవిడత కోయాల్సిన పూలను కోయకుండా పొలాల్లోనే వదిలేశామని రైతులు తెలిపారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బంతి రైతులు కోరుతున్నారు. కన్నీల పర్యంతో రైతులు బందిపూలను రోడ్డు పక్కన పడేస్తున్న దృశ్యాలు.. స్థానికులను కలవరపరచాయి.