ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Manufacture_ And_ Sale_ Of_ Kondapalli_ Toys

ETV Bharat / videos

Manufacture Sale Of Kondapalli Toys : కొండపల్లి బొమ్మల తయారీ, విక్రయ భవనం ప్రారంభం.. కళాకారులకు టూల్ కిట్ల పంపిణీ - స్పూర్తి పథకం మరియు ఎంపీ లాడ్స్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 5:36 PM IST

Manufacture and sale of Kondapalli toys : ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో కేంద్ర ప్రభుత్వం "స్పూర్తి పథకం, ఎంపీ లాడ్స్" సంయుక్తంగా నిర్మించిన కొండపల్లి బొమ్మల తయారీ, విక్రయ భవనసముదాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు సంయుక్తంగా ప్రారంభించారు. రూ.2కోట్ల 29 లక్షల 50 వేల నిధులతో కొండపల్లిలో బొమ్మల తయారీ, విక్రయ భవనసముదాన్ని నిర్మించారు. భవన ప్రారంభోత్సవం అనంతరం.. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బొమ్మల తయారు చేసే వారికి టూల్ కిట్లు అందజేశారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్​కి కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ నాయకులు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. కొండపల్లి బొమ్మలు ప్రపంచ దేశాల్లో విక్రయించాలని కేశినేని నాని కోరారు. 'కొండపల్లి.. కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి.! శతాబ్దాల నుంచి కొండపల్లి బొమ్మలు ఇక్కడ కళాకారుల చేతిలో ప్రాణం పోసుకుంటున్నాయి. ఈ బొమ్మలకు... దేశ, విదేశాల్లో ఆదరణ ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి ప్రధాన నగరాల్లో కొండపల్లి కళాకృతులకు మంచి డిమాండ్ ఉంది..' అని ఎంపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details