ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Mandali_Buddha_Prasad_Mass_Satyagraha_Deeksha_in_Avanigadda

ETV Bharat / videos

Mandali Buddha Prasad Satyagraha Deeksha in Avanigadda: పులిగడ్డ అక్విడక్ట్​ను రక్షించాలంటూ.. మండలి బుద్ధ ప్రసాద్ సామూహిక సత్యాగ్రహ దీక్ష - Puligadda Aqueduct Repairing Works

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2023, 8:26 PM IST

TDP Leader Mandali Buddha Prasad Satyagraha Deeksha in Avanigadda : పులిగడ్డ అక్విడక్ట్​ను రక్షించాలంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో సామూహిక సత్యాగ్రహ దీక్ష కార్య్రక్రమాన్ని చేపట్టారు. మోపిదేవి వార్పులోని సర్ అర్ధర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం పులిగడ్డ వారధి నుంచి దీక్షా ప్రాంగణానికి టీడీపీ శ్రేణులు, రైతులు, బుద్ధ ప్రసాద్ ఎద్దుల బండిపై వచ్చారు. దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 70 వేల ఎకరాలకు సాగునీరు, సుమారు లక్ష మంది ప్రజలకు తాగునీరు అందించే పులిగడ్డ అక్విడక్ట్​ను మరమ్మతులు చేసి (To Protect Puligadda Aqueduct) దివిసీమలో డ్రైన్​లకు పూడిక తీయాలని నేతలు డిమాండ్ చేశారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల నుంచి  సామూహిక సత్యాగ్రహ దీక్షకు భారీ సంఖ్యలో రైతులు, టీడీపీ కార్యకర్తలు   తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details