Suicide Attempt: ఎస్సై కొట్టాడని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు - ఆత్మహత్యాయత్నం
Man Suicide Attempt: పోలీస్‌స్టేషన్‌కు పిలిచి ఎస్సై కొట్టారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన మరువకముందే తాజాగా నంద్యాల జిల్లాలో కూడా ఎస్సై కొట్టాడని ఓ వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. జిల్లాలోని మిడుతూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొట్టారని చెరుకుచెర్ల గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారనే కారణంతో సొంత బంధువులే తన భర్తపై కేసు పెట్టారని బాధితుడి భార్య తెలిపింది. పోలీస్ స్టేషన్లో ఎస్సై తన భర్తపై చేయి చేసుకోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని వివరించింది. తన భర్త రవిని తీసుకెళ్లి ఎస్సై కొట్టడంతో మనస్థాపానికి గురై విషం తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశారని ఆమె తెలిపింది. చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మిడుతూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.