Minister Jogi Ramesh Followers Hulchul మంత్రి జోగి రమేష్ అనుచరుల హల్చల్.. వ్యక్తిని కారుతో ఢీ కొట్టి, ఆపై బెదిరింపులు.. - వైసీపీ కార్యకర్తల ర్యాలీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2023, 5:42 PM IST
Minister Jogi Ramesh Followers Hulchul మంత్రి జోగి రమేష్ అనుచరులు హల్ చల్ చేశారు. బంటుమిల్లికి చెందిన మారయ్య అనే వ్యక్తిని మంత్రి జోగి రమేష్ అనుచరుల కారు బలంగా ఢీ కొట్టింది. బంటుమిల్లిలో వైసీపీ కార్యకర్తల సమావేశానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆర్.కె రోజా విచ్చేశారు. మంత్రి రోజా పర్యటన సందర్భంగా పెడన నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొనేందుకు ఇబ్రహీంపట్నం నుంచి వచ్చిన మంత్రి జోగి రమేష్ అనుచరులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. చేపల చెరువు వద్ద పని ముగించుకుని ఇంటికి వెళ్లుతున్న మారయ్యను బంటుమిల్లి బైపాస్ రోడ్డులో మంత్రి జోగి రమేష్ అనుచరుల కారు ఢీ కొట్టడంతో మారయ్య అపస్మాక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే స్పందించిన స్థానికులు మచిలీపట్నం ప్రభుత్వ హస్పిటల్ కు తరలించారు. తనకు తాను పడిపోయానని చెప్పమని యానస్ అనే కానిస్టేబుల్ బెదిరించాడని బాధితుడు మారయ్య వాపోతున్నాడు. జోగి రమేష్ అనుచరులు కారు ఢీ కొట్టిందని అందుకే తాము ఏం చేయలేని పోలీసులు మాట్లాడటం దారుణమని మారయ్య బందువులు చెబుతున్నారు.