ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సముద్రంలో వేటకు వెళ్లి పడవ బోల్తా.. బోటు కిద చిక్కుకొని వ్యక్తి మృతి

ETV Bharat / videos

Boat capsizes: సముద్రంలో వేటకు వెళ్లి పడవ బోల్తా.. ఒకరు మృతి - ఏపీ తాజా వార్తలు

By

Published : Jul 9, 2023, 12:33 PM IST

Man dies after boat capsizes: సముద్రంలో వేటకు వెళ్లి పడవ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కపాశకుద్ది గ్రామానికి చెందిన బడే ఢిల్లేసు (40) ప్రతిరోజు వేటకు వెళ్లినట్టే.. ఈ రోజు కూడా వేకువ జామున నలుగురితో వ్యక్తులతో కలిసి సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరారు. అయితే వేటకు వెళ్లే కొద్ది సమయానికే అక్కడ గాలి తాకిడి ఎక్కువగా ఉండటం వలన పెద్ద ఎత్తున అలలు రావడంతో అనుకోకుండా మర పడవ బోల్తా పడంది. ఈ ఘటనలో పడవ కింద చిక్కుకొని ఢిల్లేసు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఢిల్లేసు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని కుటుంబ సభ్యులు కనీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతుడు ఢిల్లేసుకు భార్య తిరుపతమ్మ, కుమారుడు బాలు, కుమార్తె అంజలి ఉన్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details