Major General Satbir Singh letter to PM Modi: ఖతార్లో భారత మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష.. విడుదలపై మోదీకి లేఖ..
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 11:27 AM IST
Major General Satbir Singh letter to PM Modi: ఖతార్ మరణశిక్షకు గురైన 8 మంది భారత మాజీ నేవీ అధికారులను క్షేమంగా తిరిగి స్వదేశానికి తీసుకురావాలని.. భారత విశ్రాంత సైనికుల ఉద్యమం ఛైర్మన్ మేజర్ జనరల్ సత్‌బీర్ సింగ్ కోరారు. మరణశిక్ష పడ్డ సైనికుల(Indian Navy Personnel Sentenced to Death in Qatar) కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయన్నారు. ఈ విషయంలో సత్వరం జోక్యం చేసుకోవాలని.. భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
"ఖతార్ ఆర్మీకి శిక్షణ ఇచ్చేందుకు వెళ్లి అక్రమంగా, అన్యాయంగా అక్కడ చిక్కుకుని ఆ దేశం విధించిన మరణశిక్ష ఎదుర్కొంటున్న మన మాజీ నేవీ అధికారుల విషయాన్ని.. భారత ప్రభుత్వంతో పాటు దేశ ప్రజల దృష్టికి తీసుకురాదల్చుకున్నా. శిక్షణ ఇవ్వడానికి వెళ్లిన అధికారులకు ఎందుకు ఇలాంటి శిక్ష విధించారో అర్థం కావట్లేదు. నేవీ మాజీ అధికారులను క్షేమంగా తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు.. ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఏ ఒక్క సైనికుడి ప్రాణం కూడా ఈ విధంగా పోదని భరోసా కల్పించాలి. ఈ విషయంలో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాజీ సైనిక అధికారులను వీలైనంత త్వరగా దేశానికి తీసుకురావాలని కోరుతున్నాను."- మేజర్ జనరల్ సత్‌బీర్ సింగ్, భారత విశ్రాంత సైనికుల ఉద్యమం ఛైర్మన్
TAGGED:
Indians in Qatar