Mahadharna in Vijayawada on 26th for Dalit Rights: దళితుల హక్కుల సాధనకు పోరాటం.. 26న విజయవాడలో మహధర్నా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 13, 2023, 12:19 PM IST
Mahadharna in Vijayawada on 26th for Dalit Rights :దళితులపై పెరుగుతున్న దాడులు (Attacks on Dalits), వారి హక్కుల సాధన కోసం ఈ నెల 26వ తేదీన విజయవాడలో మహాధర్నా చేపడుతున్నామని దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి (KVPS Meeting in Vijayawada for Dalit Rights) తెలిపారు. మహాధర్నాపై దళితులను జాగృతం చేసేందుకు ఆయా జిల్లాల్లో బైక్, సైకిల్, పాదయాత్రలు నిర్వహిస్తామని అన్నారు. ప్రభుత్వం దళితుల హక్కులను హరించి వేసిందని మండిపడ్డారు. దళితులు సామాజికంగా, ఆర్ధికంగా ముందుండాలని, దళితులకు రాజ్యంగం ఇచ్చిన హక్కులకు అనుగుణంగా వారికి ప్రత్యేక పథకాలను రూప కల్పన చేయాలని వారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పథకాల సంగతేమో కానీ దళితులకు అందుతున్న దాదాపు 25 పథకాలను రద్దు చేశారని (YSRCP Government Cut Welfare Schemes to Dalit) ఆరోపించారు. ప్రభుత్వం ఇంత వరకు దళితులకు ప్రత్యేక పథకాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత విద్యార్ధులకు ఉపకార వేతనాలు లేవని, అదేమంటే అమ్మ ఒడి ఇస్తున్నామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే తాము ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. దళితులందరు ఈ మహాధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.