Polavaram victims: "తాడో పేడో తేల్చుకుంటాం".. పోలవరం బాధితుల మహా పాదయాత్ర - Polavaram project
Polavaram victims: పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమ విషయంలో నిర్లక్ష్యం చూపుతోందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ముంపు బాధితులు, నిర్వాసితులకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోలవరం నుంచి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపట్టగా.. అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూమి కోల్పోయిన తమకు భూమి, పది లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తోంది తప్ప.. న్యాయం చేయటం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికి వరదలు వచ్చిన సమయంలో తమ ఇళ్లు మునిగి దుర్భర జీవితం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత వరదల్లో 193 గ్రామాలు మునిగితే కేవలం 56 గ్రామాలనే గుర్తించారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే మహా పాదయాత్ర చేపట్టామన్నారు. ఈనెల 4వ తేదీన విజయవాడలో మహా ధర్నా చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించి పోలవరం ప్రాజెక్టు బాధితులు, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ చేపట్టిన పోలవరం ప్రాజెక్టు బాధితులు, నిర్వాసితుల పాదయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.