Maddipati Shri Rajesh Participated in Lokesh Padayatra : "మాతృభూమిపై ప్రేమతోనే వచ్చాను.. రాష్ట్ర పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతోంది" - ప్రముఖ వైద్య నిపుణులు మద్దిపాటి శ్రీ రాజేశ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 10:42 PM IST
England Medical Expert Maddipati Shri Rajesh Comments on AP Situation: ఉజ్వల భవిష్యత్తు కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు మద్దిపాటి శ్రీ రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవని.. సంపద సృష్టించకుండానే పంచుతున్నారని ఆరోపించారు. ఆహ్వానం లేకపోయినా సరే రాష్ట్రం మీద ప్రేమతో.. విభజన నుంచి ఇప్పటివరకు చాలాసార్లు వచ్చినట్లు విభజించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వృత్తిరీత్యా విదేశాల్లో స్థిరపడినా మాతృభూమిపై ఉన్న మమకారంతో లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఒక వైద్యునిగా ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునే సమయంలో యువనేత హావభావాలు ఎలా ఉండాలన్న దానిపై సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందంటున్న శ్రీ రాజేశ్‌తో మా ప్రతినిధి మహేశ్ ముఖాముఖి.