ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lower Water Levels in Reservoirs in AP

ETV Bharat / videos

Lower Water Levels in Reservoirs in AP: రైతులెవరూ నార్లు పోయొద్దు.. నీటిని విడుదల చేయలేం! : నెల్లూరు జిల్లా అధికారులు - ఏపీలోని రిజర్వాయర్లలో తగ్గిన నీటి మట్టం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2023, 4:54 PM IST

Lower Water Levels in Reservoirs in AP: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలలో నీరు తక్కువగా ఉన్నాయని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. దీంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు అన్నదాతలకు శాపంగా మారింది. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 30 టీఎంసీలు, కండలేరు జలాశయంలో 11 టీఎంసీలు నీరు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులకు రబీ సీజన్లో నీరు విడుదల చేయలేమని అధికారులు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నంత వరకూ రైతులు నార్లు పోసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు పడి జలాశయాలకు నీరు వస్తే తప్ప పంటలకు నీటిని ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ విషయాన్ని రైతులకు గమనించాలని, తొందరపడి రైతులు ఎవరూ నార్లు వేయవద్దని అన్నారు. కాగా ఇప్పటికే నీరు లేక పలు జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. దీనిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడంలేదు. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

ABOUT THE AUTHOR

...view details