Low Water Level in Srisailam Reservoir: వెెలవెలబోతున్న శ్రీశైలం జలాశయం.. తీవ్ర ఆవేదనలో రైతులు - srisailam reservoir
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 2:01 PM IST
Low Water Level in Srisailam Reservoir: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మందగించింది. ప్రతి ఏడాది ఇదే సమయానికి శ్రీశైలం జలాశయం వరదనీటితో కళకళలాడేది. కర్ణాటకలో వర్షాలు లేకపోవడంతో కృష్ణా నదికి దిగువన ఉన్న తెలుగు రాష్ట్రాల జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రతి ఏడాది వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరేది. దీంతో ఆగస్టు నెలలో శ్రీశైలం జలాశయం గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేసేవారు.
శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 854.70 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 91.19 టీఎంసీలుగా నమోదయింది. ఎగువ పరివాహక ప్రాంతాలైన తుంగభద్ర, జూరాల నుంచి నీటి ప్రవాహం నిలిచిపోయింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు వరద ప్రవాహం నిలిచిపోవడంతో శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముందుకు సాగడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. జూరాల, హంద్రీనీవా నుంచి వచ్చిన 100 టీఎంసీల వరద నీటిని పొదుపుగా వినియోగిస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.