ఆంధ్రప్రదేశ్

andhra pradesh

weather in ap

ETV Bharat / videos

బంగాళాఖాతంలో అల్పపీడనం - భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం - weather updates

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 5:32 PM IST

Low Pressure in Bay of Bengal Seems To Heavy Rain in AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ సునంద తెలిపారు. 

Heavy Rain Alerts in Next Two Days: ఇది  ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల.. మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురవొచ్చని ఆమె తెలిపారు. ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details