Lorry Stuck in Pothole on Main Road: గుంతలో ఇరుక్కున్న లారీ.. భారీగా ట్రాఫిక్ జామ్ - Lorry Stuck in Guntha
Lorry Stuck in Pothole on Main Road: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకి అతి సమీపంలో ఒక లారీ గుంతలో ఇరుక్కుపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీ గుంతలో ఇరుక్కుపోవడంతో మూడున్నర కిలోమీటర్లకు పైగా వాహనాలు ఆగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సమాచారం అందుకున్న కొమరాడ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి.. ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. రోడ్లు బాగుచేయని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని.. స్థానికులు, సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఇలాగే కొనసాగితే వర్షాకాలం వస్తే భారీగా ట్రాఫిక్ జాం అయ్యే పరిస్థితి ఉందని.. ఇప్పటికైనా రోడ్ల, భవనాల శాఖ అధికారులు పార్వతీపురం నుంచి కూనేరు వరకు వెళ్లే రహదారిపైన గోతులు పూడ్చి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు చేస్తామన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.