Lorry Hit to Electric Pole: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ.. ఎప్పుడు పడుతుందోనని స్థానికుల టెన్షన్
Lorry Hit to Electric Pole :నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని ఆర్యవైశ్య ప్రధాన వీధి మార్గంలో సాయిబాబా గుడి ఎదురుగా తెల్లవారుజామున ధాన్యం మిల్లు నుంచి పొట్టు లోడుతో లారీ వెళ్తుంది. అదే సమయంలో స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు లారీకి తగిలి.. అలాగే ముందుకెళ్లిపోవడంతో కరెంటు స్తంభం ఒక్కసారిగా ఒరిగిపోయింది. ఆ స్తంభంకు విద్యుత్ సరఫరా ఉన్నందున వెంటనే తెరుకున్న స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. స్తంభం పూర్తిగా పడిపోయి ఉంటే.. ప్రజలు నిత్యం తిరుగుతూ ఉండే ప్రాంతం కావడంతో భారీ ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు. ఎప్పుడు పడిపోతుందో తెలియని స్థితిలో ఉన్న స్తంభాన్ని చూసి స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. తాత్కాలికంగా నిచ్చెన అడ్డు పెట్టారు.. ఎప్పుడు కింద పడిపోతుందో తెలియదంటూ అక్కడి స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే కరెంటు స్తంభాన్ని మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.