ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lokesh_Yuvagalam_Padayatra_Break_Due_to_Cyclone

ETV Bharat / videos

తీవ్ర తుపాను దృష్ట్యా నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు విరామం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 12:13 PM IST

Lokesh Yuvagalam Padayatra Break Due to Cyclone: తీవ్ర తుపాను నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. తుపాను రెడ్ అలర్ట్ ఇవ్వటంతో పాదయాత్రకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించినట్టు పార్టీ నేతలు తెలిపారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్ర నిలిపివేశారు. తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం, ఈదురుగాలులు కురుస్తున్నాయి. తుపాను ప్రభావం తగ్గిన తరువాత ఈనెల 7వ తేదీన మళ్లీ శీలంవారిపాకల నుంచి యువగళం ప్రారంభించాలని నిర్ణయించిన్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.

నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర ఆదివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 216వ రోజు యండ్లపల్లి జంక్షన్ నుంచి ప్రారంభం కాగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి లోకేశ్​కు సంఘీభావం ప్రకటించారు. చిన్నా, పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యువగళం పాదయాత్రలో ఉత్సాహంగా లోకేశ్ వెంట నడిచారు. మంచి జోరుమీద ఉన్న పాదయాత్రకు తుపాను కారణంగా బ్రేక్ పడింది. 

ABOUT THE AUTHOR

...view details