ఆంధ్రప్రదేశ్

andhra pradesh

lokesh_yuvagalam_final_public_meeting

ETV Bharat / videos

యువగళం-నవశకం - భారీగా తరలి వచ్చిన ప్రజలు - డ్రోన్​ దృశ్యాలు - pawan kalyan in yuvagalam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 6:58 PM IST

Lokesh Yuvagalam Final Public Meeting  : యువగళం-నవశకం భారీ బహిరంగ సభ ఏపీలోని విజయనగరం జిల్లా పోలిపల్లిలో ప్రారంభమైంది. యువగళం విజయోత్సవ సభను తెలుగుదేశం కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. యువగళం కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. యువగళం-నవశకం బహిరంగ సభా ప్రాంగణానికి జనం తండోప తండాలుగా తరలివచ్చారు. టీడీపీ - జనసేన పార్టీ జండాలు, పార్టీ పతకాలు చేత పట్టుకుని జై టీడీపీ, జైజై లోకేశ్​, జై చంద్రబాబు, జైజై పవన్ అంటూ నినాదాలతో సభా వేదిక వద్దకు చేరుకున్నారు. 

టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభకు తరలి వచ్చిన అభిమానులు కార్యకర్తలో సభా ప్రాంగణం నిండిపోయింది. ఈ సభకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్ సహా బాలకృష్ణ, టీడీపీ, జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details