Lokesh Tweet on Roads Damage: 'గోదావరి జిల్లాలోని రోడ్లను చూస్తుంటే.. చంద్రయాన్-3 చిత్రాలను చూసినట్లుంది'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 12:35 PM IST
Lokesh Tweet on Roads Damage: గోదావరి జిల్లాలోని రోడ్లను చూస్తుంటే.. చంద్రయాన్-3 విడుదల చేసిన చిత్రాలను చూసినట్లు ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మొగల్తూరు సమీపంలోని పడమటివారిపాలెం వద్ద ప్రధాన రహదారిని చూస్తే ఎవరికైనా అదే అనుభూతి కలుగుతుందన్నారు. తన పాదయాత్రలో రోడ్డులు చెరువును తలపించాయంటూ ఫొటోలు జత చేశారు. రాష్ట్రంలో జలగన్న గుంతల పథకానికి ఇదో మచ్చుతునక మాత్రమేనని ఆయన విమర్శించారు. గోదావరి జిల్లాలంటే పచ్చటి ప్రకృతిసోయగాలు మాత్రమే తెలిసిన తనకు చంద్రయాన్–3 విడుదల చేసిన చిత్రాలు గుర్తొచ్చాయని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 2,800 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఇంత దారుణమైన రోడ్లను ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. రూపాయి ఖర్చులేకుండా చంద్రుడి మీదకు వెళ్లిన అనుభూతి పొందాలంటే ఎవరైనా ఇక్కడకు రావొచ్చునని ఎద్దేవాచేశారు. ఎవరేమనుకున్నా నవ్విపోదురుగాక తనకేటి సిగ్గు అంటూ విదేశాల్లో విహారయాత్ర చేస్తున్న జలగన్నకు హేట్సాఫ్ అంటూ లోకేశ్ దుయ్యబట్టారు.