Lokesh Selfie Challenge at HCL: గన్నవరంలో యువగళం పాదయాత్ర.. రాష్ట్రానికి హెచ్‌సీఎల్ తెచ్చానంటూ లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ - Yuvagalam News
Lokesh Selfie Challenge at HCL:యువగళం పాదయాత్రకు.. గన్నవరం జనాలు నీరాజనాలు పలికారు. 190వ రోజు పాదయాత్రను కృష్ణా జిల్లా నిడమానూరు నుంచి ప్రారంభించిన లోకేశ్‌కు.. ప్రజలు సాదర స్వాగతం పలికారు. ఎదుటపడిన వారిని లోకేశ్ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. పాదయాత్ర హెచ్‌సీఎల్ వద్దకు చేరుకోగానే ఉద్యోగులు వచ్చి కలిశారు. తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి హెచ్‌సీఎల్ తెచ్చామంటుూ సెల్ఫీ సవాల్ విసిరారు.
Tension Over Police Diverting Lokesh Padayatra Route:గన్నవరంలో లోకేశ్ పాదయాత్ర మార్గాన్ని పోలీసులు మళ్లించడం.. స్వల్ప ఉద్రిక్తత రేపింది. రూట్‌మ్యాప్ ప్రకారం గన్నవరం MLA వల్లభనేని వంశీ కార్యాలయం ఎదురుగా పాదయాత్ర వెళ్లాల్సి ఉండగా..పోలీసులు అటువైపు వెళ్లకుండా బారికేడ్లు అడ్డుపెట్టారు. అదే సమయంలో కరెంటు సరఫరా నిలిపివేశారు. యువగళం స్ఫుూర్తిని దెబ్బతీయాలనే కుట్రలో చిక్కుకోవద్దంటుూ లోకేశ్ నాయకులు కార్యకర్తలకు సూచించారు.
Yarlagadda Venkatarao Participated in Padayatra:గన్నవరం వైసీపీ నేత, కృష్ణా జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు.. తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ సమక్షంలో.. పసుపు కండువా కప్పుకొన్నారు. యార్లగడ్డ వెంకట్రావును లోకేశ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేశ్ వెంట పాదయాత్రలో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.