ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lokesh_Reacted_to_Farmer_Suicide_in_Guntur_District

ETV Bharat / videos

అన్నదాతల ఆత్మహత్యలపై లోకేశ్ ఆవేదన- మూడు నెలల్లో ప్రజా ప్రభుత్వం వస్తుందని రైతులకు భరోసా - Lokesh reacted to farmer suicide in Guntur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 9:53 PM IST

Updated : Dec 21, 2023, 10:28 PM IST

Lokesh Reacted to Farmer Suicide in Guntur District : గుంటూరు జిల్లాలో కిశోర్ బాబు అనే రైతు ఆత్మహత్య రాష్ట్రంలో అన్నదాతల దుస్థితికి అద్దం పడుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో తుపాను వల్ల  ఐదెకరాల మినుము పంట పూర్తిగా నష్టపోయింది. అప్పులు తీర్చే మార్గంలేక  కిశోర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన తనను తీవ్ర ఆవేదన కలిగిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. పదిరోజుల క్రితం దుగ్గిరాలకు చెందిన బసవ పున్నయ్య ఆత్మహత్య తీవ్రంగా కలిచివేసిందన్నారు. కరవుతో కొంత, తుపానుతో పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోనందునే అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

ఇవి ముమ్మాటికి జగన్ సర్కారు చేసిన హత్యలేనని ఆరోపించారు. రైతుల ఆత్మహ‌త్యల్లో దేశంలోనే మ‌న రాష్ట్రం మూడో స్థానంతో ఉండటం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖ‌రికి నిద‌ర్శన‌మ‌న్నారు. అధైర్యపడి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు. కేవలం మూడు నెలల్లో ప్రజా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందంటూ భరోసా ఇచ్చారు. కిశోర్ బాబు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Last Updated : Dec 21, 2023, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details