Lokesh Rayalaseema Declaration: రాయలసీమ అభివృద్ధిపై నేడు లోకేశ్ కీలక ప్రకటన - TDP
Lokesh Key Announcement Rayalaseema Declaration: జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాయలసీమ వ్యాప్తంగా పాదయాత్ర ముగియనుండడంతో.. ఇవాళ సాయంత్రం వైయస్సార్ కడప జిల్లాలో రాయలసీమ డిక్లరేషన్‌పై కీలకమైన ప్రకటన చేయనున్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమ కోసం ఏం చేస్తామనే దానిపైన సీమ ప్రజలను ఆదుకోవడానికి కడప కేంద్రంగా నారా లోకేశ్ సాయంత్రం కీలక ప్రకటన చేయనున్నారు. ఏ అంశాలపైన.. ఎలాంటి ప్రకటన చేస్తారా.. అనే దానిపైన కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీనిపై దేశ నేతలతో కూడా నారా లోకేశ్ సంప్రదింపులు జరిపారని సమాచారం. కాగా ఈ రోజు సాయంత్రం లోకేశ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏ అంశాలపై ప్రకటన చేస్తారో అని సీమలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.