జోరుగా లోకేశ్ పాదయాత్ర.. భారీగా పాల్గొంటున్న ప్రజలు - ఏపీ తాజా వార్తలు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. పాదయాత్రలో రోజురోజుకు భారీగా ప్రజలు పాల్గొంటున్నారు. వెళ్లిన ప్రతిచోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేశ్ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని సామాజికవర్గాలు, యువతతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలు.. జగన్ హామీ ఇచ్చి నెరవేర్చని విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్‌కు లోకేశ్ సవాళ్లు విసురుతున్నారు. కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదని.. పార్టీ గెలవని చోట పోటీ చేసి గెలిచే సత్తా జగన్‌కు ఉందా అని లోకేశ్ సవాల్ విసిరారు. టీడీపీకి ఏ మాత్రం పట్టులేని మంగళగిరి వచ్చే ఎన్నికల్లో గెలిచి కంచుకోటగా మారుస్తా అని ధీమా వ్యక్తం చేశారు. 36వ రోజు అన్నమయ్య జిల్లా పీలేరు నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర కలికిరికి చేరింది. లోకేశ్ పాదయాత్రలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.