ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara Lokesh Yuvagalam

ETV Bharat / videos

Yuvagalam: 'మీ సహాయం మరువలేనిది'.. యువగళం వాలంటీర్లకు నారా భువనేశ్వరి భోజనాలు - food to the Yuvagalam volunteers

By

Published : May 15, 2023, 11:01 PM IST

Updated : May 16, 2023, 1:22 PM IST

Nara Lokesh Yuvagalam : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  చేపట్టిన యువగళం  పాదయాత్ర 100 రోజుల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా 100వ రోజు లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందు నడిచారు. నంద్యాల జిల్లా మోతుకూరులో తన భువనేశ్వరితో కలిసి వందరోజుల పైలాన్‌ను లోకేశ్‌ ఆవిష్కరించారు.  పాదయాత్ర ముగిసిన అనంతరం నారా భువనేశ్వరి లోకేశ్​ యువగళం యాత్రలో తోడుగా ఉంటున్న వాలంటీర్లు, టీమ్‌ సభ్యులతో ముచ్చటించారు. వారికి నారా భువనేశ్వరి స్వయంగా భోజనం వడ్డించి వారికి ధన్యవాదాలు తెలిపారు. నారా లోకేశ్ బస చేసిన విడిది కేంద్రం వద్ద ఉన్న వారితో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.  తన కుమారుడి పాదయాత్రలో వారు చేస్తున్న సహాయాన్ని మరిచిపోలేని వెల్లడించారు.  లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర వంద రోజుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకున్నారు. 

Last Updated : May 16, 2023, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details