Lokesh Comments On Avinash Reddy: ఎన్ని డ్రామాలు వేసినా.. అబ్బాయి అడ్డంగా దొరికిపోయారు: లోకేశ్
Lokesh Comments On Avinash Reddy: సీబీఐ అరెస్టుకు భయపడే గుండెపోటు పేరుతో సొంత తల్లినే అవినాష్‌రెడ్డి అడ్డం పెట్టుకున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. ఎన్ని డ్రామాలు వేసినా అబ్బాయి అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న లోకేశ్.. త్వరలోనే హత్య కేసు నిందితులతో పాటు వెనకున్న మాస్టర్‌మైండ్‌కు కూడా శిక్ష పడుతుందన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో లోకేశ్ బహిరంగసభ నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరగనున్న మహానాడులో యువతకు ఉద్యోగకల్పనపై స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తామని లోకేశ్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వైసీపీ రద్దు చేసిన పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కర్నూలులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి వలసలకు అడ్డుకట్టవేస్తామన్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అక్రమాల్లో ఆరితేరిపోయారన్న లోకేశ్ వాటిని ప్రశ్నిస్తున్నందుకే భూమా అఖిలప్రియను జైలుపాలు చేశారని విమర్శించారు. అన్నీ లెక్క రాసుకుంటున్నామన్న లోకేశ్.... అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. నేటితో లోకేశ్ యాత్ర కర్నూలు జిల్లాలో ముగిసింది. బుధవారం కడప జిల్లాలోకి పాదయాత్ర జరగనుంది.