రయ్‌మంటూ దూసుకుపోతున్న ఇసుక లారీలు.. స్థానికుల ఆందోళన - Sand mining in Konaseema
Locals blocking sand lorries: అడ్డూ అదుపు లేకుండా ఇసుక లారీలు శరవేగంగా నడుపుతున్న కారణంగా.. రహదారులు దెబ్బతింటున్నాయని.. వ్యాపారాలు సాగక ఇబ్బంది పడుతున్నామంటూ.. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వర్తకులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. లారీలు వెళ్లే సమయంలో ఇసుక రహదారులపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీల వేగానికి కళ్లెం వేయాలని.. రోడ్డుపై పడిన ఇసుకను తొలగించి శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కారణంగా ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. మీరు ఇష్టానుసారంగా వేగంగా లారీలు నడుపుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాలు గురించి పట్టించుకోవడం లేదని సబ్ ఇన్స్పెక్టర్ హరికోటి శాస్త్రి లారీ డ్రైవర్లను హెచ్చరించి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. వేగంగా లారీలు నడుపుతూ.. మా వాహనాలపైకి కూడా వస్తున్నారని ఎస్సై అన్నారు. మీ యజమానులను పిలవండి అని ఎస్సై వారికి చెప్పగా.. యజమానులు రారు అంటూ డ్రైవర్లు సమాధానమిచ్చారు.. చివరకు లారీలను పోలీస్ స్టేషన్‌కు తరలించి చర్యలు తీసుకున్నారు.