ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Liquor seized: రూ.130కి కొని రూ.700కు అమ్మకం.. దిల్లీ మద్యం విక్రయిస్తున్న వైసీపీ కార్యకర్త - Liquor seized in YCP worker house in Bapatla

🎬 Watch Now: Feature Video

వైసీపీ కార్యకర్త ఇంట్లో పట్టుబడ్డ దిల్లీ మద్యం.. ఇద్దరు అరెస్ట్​

By

Published : Jun 25, 2023, 9:42 AM IST

Delhi Liquor seized in YCP worker house: బాపట్ల జిల్లా కర్లపాలెం సత్యవతిపేటలో వైసీపీ కార్యకర్త ఇంట్లో దిల్లీ మద్యం సీసాలు పట్టుబడ్డాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బాపట్ల సెబ్‌ సీఐ శ్రీనివాసులు.. సిబ్బందితో కలిసి వైసీపీ కార్యకర్త కప్పల నారాయణరెడ్డి ఇంటిపై దాడి చేసి.. లక్షన్నర విలువ చేసే 227 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం చెందిన వైసీపీ కార్యకర్త మారుబోయిన వెంకటేశ్వర రెడ్డి దిల్లీలో తక్కువ ధరకు మద్యం సీసాలు కొని రైలులో తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. తర్వాత తన మామ కప్పల నారాయణరెడ్డి జతయ్యారు. ఆదాయం బాగా వస్తుండడంతో ఇద్దరూ దిల్లీ వెళ్లి వందల సంఖ్యలో మద్యం సీసాలు కొనుగోలు చేసి సత్యావతిపేటలోని నారాయణరెడ్డి ఇంట్లో నిల్వ చేస్తున్నారు. దిల్లీలో ఒక్కొక్క సీసా 130 రూపాయలకు కొని.. ఇక్కడి 700 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ABOUT THE AUTHOR

...view details