ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leader Somireedy on Liquor Scam in AP

ETV Bharat / videos

Liquor scam in AP: అమిత్‌షా కన్నెర్ర చేస్తే.. ఏపీలో మద్యం స్కాం గుట్టురట్టవుతుంది: సోమిరెడ్డి - విశాఖ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

By

Published : Jun 14, 2023, 5:10 PM IST

TDP Leader Somireedy on Liquor Scam in AP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కన్నెర్ర చేస్తే.. మరుక్షణమే ఏపీలో మద్యం స్కాం గుట్టురట్టవుతుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల రూపాయల లిక్కర్ క్యాష్ వ్యాపారంలో ప్రభుత్వ ఖజనాకు జమైంది ఎంత.. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ నేతల జేబుల్లోకెంత అంటూ ప్రశ్నించారు. విశాఖ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఏపీలో జరుగుతున్న లిక్కర్ స్కామ్​ను ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు జగన్ రెడ్డిని పాపం పసివాడు అనుకున్న బీజేపీకి.. భారీ అవినీతిపరుడునే విషయం ఇప్పుడు తెలిసొచ్చినట్టుందని విమర్శించారు.

ఏపీలో, జగన్ రెడ్డి పాలనలో ఆయన చెప్పిన మందునే కొనాలని.. ఆన్​లైన్​ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ మాత్రమే కట్టాలని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. టీ షాపులు, కూరగాయల దుకాణాలు, కిళ్లీ అంగళ్లలో కూడా పేటీఎం స్కానర్లు కనిపిస్తున్నాయన్న ఆయన.. ప్రభుత్వ మద్యం షాపుల్లో మాత్రం ఓన్లీ క్యాష్ అంటూ విమర్శించారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే.. జగన్ రెడ్డి మాత్రం క్యాష్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి 30 వేల కోట్ల రూపాయలు లెక్కన.. నాలుగు సంవత్సరాలలో లక్ష కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిగితే ప్రభుత్వ ఖజానాకు ఎంత జమ అయ్యింది.. వైసీపీ నేతల జేబుల్లోకి ఎంత చేరిందో దేవుడికే తెలియాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details